GSWS Department కొత్తగా ఇచ్చిన Household Mapping Adding and Splitting సర్వీస్ గురించి కొన్ని ముఖ్య విషయాలు.
ముందుగా మీ Household Mapping లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి – CLICK HERE
Household Mapping service కు Rice Card (రేషన్ కార్డ్) service కు సంబంధం లేదు. Rice Card లేకపోయినా లేదా cancel అయ్యిన Household Mapping Split అయ్యాక మరలా తిరిగి Apply చేసుకోవాలి. * కావున ముందు Household Mapping Split గురించి తెలుసుకుందాం.
Case1
Household లో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఒక Mapping లో ఉంటే నేరుగా సచివాలయం లో service Apply చేసుకోవచ్చు.
Splitting of Household Mapping Application Form – DOWNLOAD NOW
HOUSEHOLD MAPPING SPLIT WEA-WWDS FIELD VERIFICATION FORM – DOWNLOAD NOW
HOUSEHOLD MAPPING SPLIT PS-WAS FIELD VERIFICATION FORM – DOWNLOAD NOW
Case 2
Household లో తల్లి, తండ్రి, కొడుకు, ఒక Mapping లో ఉండి కోడలు వాళ్ళ పుట్టింటి Household Mapping లో ఉంటే…
రెండు TASKS లు చేయవలసి ఉంటుంది
TASK 1 కోడలిని HH మ్యాపింగ్ లో add చేయాలి.
దీనికి గాను Marriage Certificate అవసరం. అదే విధంగా DA లాగిన్ లో Marriage Migration Service Request Apply చేయాలి, దీనికి గాను భార్య, భర్త ఇద్దరు వేలిముద్రలు బయోమెట్రిక్ device lo వేయాలి కనుక భార్య భర్త తప్పని సరిగా సచివాలయం కు హాజరు అవ్వాలి.
DA or EDPS తదుపరి PS or WAS లాగిన్ అంతిమంగా MPDO OR MUNICIPAL COMMISSIONER లాగిన్ లో ఈ Request Approve అయితే అప్పుడు Household లో కోడలు add అవుతారు.
Member Migration on Marriage Grounds Application and Verification Form – DOWNLOAD NOW
అప్పుడు ఈ Family case 1 లా మారుతుంది.
*Verify procedure of case1*
Case 3
HOUSEHOLD MAPPING లో తల్లి/తండ్రి (ఒకరు మరణించిన) ఒకరు మాత్రమే ఉండి కొడుకు, కోడలు ఉంటే House Hold Split ఆప్షన్ లో Single Old Age Person Split ఆప్షన్ Activate చెయ్యటం జరిగింది.
ఈ ఆప్షన్ PS Gr-VI (DA) / WEDPS వారి AP సేవ పోర్టల్ లో అందుబాటులో ఉంది.
ఈ ఆప్షన్ ఉపయోగించటానికి House Hold మాపింగ్ లో కనీసం ఒక జంట ఉండాలి.
Single House Hold Mapping ద్వారా విభజన కేవలం 01 వ్యక్తికి మాత్రమే అవుతుంది.
ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారి వయసు 60 సంవత్సరాలకన్నా ఎక్కువ ఉండాలి మరియు Widow / Widower అయ్యి ఉండాలి.
ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. మరియు డాక్యుమెంట్ సెక్షన్ లో Spouse Death Certificate / Rice Card/ Widow Pension Card అప్లోడ్ చేయాలి.
Case 4
Household MAPPING లో తల్లి/తండ్రి (ఒకరు మరణించిన) ఒకరు మాత్రమే ఉండి కొడుకు తో కలిసి హౌజ్ హోల్డ్ లో ఉంటూ కోడలు వాళ్ళు పుట్టింటి వాళ్ళతో హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే
రెండు టాస్క్ లు చేయవలసి ఉంటుంది
టాస్క్ 1 కోడలిని HH మ్యాపింగ్ లో add చేయాలి.
దీనికి గాను Marriage Certificate అవసరం. అదే విధంగా DA లాగిన్ లో Marriage Migration Service Request Apply చేయాలి, దీనికి గాను భార్య, భర్త ఇద్దరు వేలిముద్రలు బయోమెట్రిక్ device lo వేయాలి కనుక భార్య భర్త తప్పని సరిగా సచివాలయం కు హాజరు అవ్వాలి.
DA or EDPS తదుపరి PS or WAS లాగిన్ అంతిమంగా MPDO OR MUNICIPAL COMMISSIONER లాగిన్ లో ఈ Request Approve అయితే అప్పుడు Household లో కోడలు add అవుతారు. అప్పుడు ఈ ఫ్యామిలీ case 3 లా మారుతుంది.
*Verify Case 3*
Case 5
విడాకులు తీసుకున్న భార్య భర్తలు ఒక Household MAPPING లో ఉంటే Court ద్వారా పొందిన Divorce ఉంటే విడి విడి Household లుగా add అవ్వొచ్చు .
*తల్లి, తండ్రి, కొడుకు, కోడలు లను ప్రామాణికం గా తీసుకున్నాం కానీ ఇక్కడ కూతురు అల్లుడు, తమ్ముడు మరదలు, ఇలా అన్నీ రిలేషన్స్ కు ఈ case లు వర్తిస్తాయి.
SPLIT అయ్యాక మీ Household MAPPING ని చెక్ చేసుకోవడానికి – CLICK HERE
household mapping status
For Family Migration Report (FMR) and Marriage Migration Report (MMR) Click below