AP Government Schemes List (ప్రభుత్వ సంక్షేమ పథకాలు)

ap government schemes list

వై.యస్.ఆర్. పెన్షన్ కానుక​

పథకం నిర్వహించువారు : పంచాయితీరాజ్ & రూరల్ డెవలప్మెంట్

పథకం నిర్వహించు అధికారులు సమన్వయ అధికారి : యం.పి.డి.వో / మున్సిపల్ కమీషనర్

జి.ఓ నం. 103, తేది 30-05-19 ద్వారా వృద్ధాప్య పెన్షన్ కోసం వయో పరిమితి 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించడమైనది వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు కల్లు గీత కార్మికులకు మత్స్యకారులకు ఒంటరి స్త్రీలకు, ధర్మకారులకు మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నెలకు పెన్షన్ మొత్తాన్ని రూ.2.250/- కు పెంచడం జరిగింది. ఈ పెంపు మొత్తాన్ని రూ. 3,000/- వరకు పెంచడం. జరుగుతుంది. వికలాంగులకు నెలకు పెన్షన్ మొత్తాన్ని రూ 3,000/- మరియు ప్రభుత్వ & నెట్ వర్క్ హాస్పిటల్స్ |డయాలసిస్ చేయించుకొంటున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు పెన్షన్ మొత్తాన్ని రూ. 10,000/ లకు పెంచడం జరిగినది. తలసీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.10,000/- పెన్షన్ మంజూరు చేయబడినది.

 

10 రోజుల్లో పెన్షన్

1 వ రోజు- పెన్షన్ దరఖాస్తు గ్రామ/వార్డ్ వాలంటీర్కు సమర్పించాలి

2 & 3వ రోజు – WEA/WWDS దరఖాస్తుదారులు వివరాలు పరిశీలించి GSWS పోర్టల్లో తప్పనిసరి పత్రాలు అప్లోడ్ చేయాలి.

4 & 5వ రోజు – యం.పి డి.ఓ / మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులను పరిశీలిస్తారు. మరల ధృవీకరణ అవసరమైతే WEA WWDS కు పంపబడుతుంది.

6 & 7వ రోజు – అంగీకరించిన తిరస్కరించబడిన ముసాయిదా దరఖాస్తులను సామాజిక తనిఖీకోసం గ్రామ / వార్డు సచివాలయం నోటీసు బోర్డులో ఉంచబడుతుంది.మరియు దరఖాస్తుదారుడి నుండి అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారు.

8 & 9వ రోజు – యం.పి.డి.ఓ / మున్సిపల్ కమీషర్ జాగ్రత్తగా పరిశీలించి. ధృవీకరించిన తరువాత అభ్యంతరాలు పరిష్కరించబడును.

10వ రోజు – అంగీకరించిన దరఖాస్తులకు మంజూరు ఉత్తర్వులను, పెన్షన్ పాస్ బుక్, కార్డు: మరియు హుకుం లేఖతోపాటు లబ్దిదారునకు వాలంటీర్ ద్వారా బయో మెట్రిక్ గుర్తింపు తీసుకొని వారి ఇంటివద్దనే అందజేస్తారు.

కేటగిరీ వారిగా పెన్షన్ దరఖాస్తుదారులకు ఉండవలసిన అర్హతలు

అన్ని కేటగిరీలకు BPL కి చెందినవారు (తెల్లరేషన్ కార్డ్ కలవారు). ఏ పెన్షన్ పొందనివారు మరియు జిల్లావారు అయి ఉండాలి.

1. వృద్ధాప్య పెన్షన్ – అర్హతలు : 60 సం||లు ఆపై వయస్సు కలిగినవారు మరియు గిరిజనులకు 50 సంవత్సరాల వయస్సు వుండాలి.

2. వితంతువుల పెన్షన్ – అర్హతలు:  వివాహచట్టం ప్రకారం 21 సంవత్సరాల వయస్సు కలిగి, భర్త మరణ ధృవీకరణ పత్రం వుండాలి.

3. వికలాంగుల పెన్షన్ అర్హతలు:40% అంతకన్నా ఎక్కువ అంగవైకల్యం వుండి సదరం సర్టిఫికేట్ వుండాలి. వయోపరిమితి లేదు.

4. చేనేత కార్మికుల పెన్షన్ అర్హతలు : వయస్సు 50 సం॥లు వుండి చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

5. కల్లుగీత కార్మికుల పెన్షన్ అర్హతలు : వయస్సు 50 సం||లు వుండి ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

6. మత్స్యకారుల పెన్షన్ అర్హతలు:వయస్సు 50 సం॥లు వుండి మత్స్యశాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

7. HIV భాదితులు (PLHIV) పెన్షన్ అర్హతలు:వయో పరిమితి లేదు 6 నెలలు వరుసగా ART TREATMENT తీసుకున్నవారు

8. డయాలసిస్ (CKDU) పెన్షన్ అర్హతలు వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ వున్నవారు (స్టేజ్ 3,4 & 5).

9. హిజ్రాల (ట్రాన్స్ జెండర్) పెన్షన్ అర్హతలు :18 సం॥లు వయస్సు కలిగి, ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి సర్టిఫికేట్ కలిగినవారు.

10. ఒంటరి మహిళల పెన్షన్ అర్హతలు:వయస్సు 35 సం॥లు మరియు ఆపైన వుండి చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు లేదా ఒక సంవత్సరం పైగా భర్త నుండి విడిపోయి జీవనం సాగిస్తున్నవారు గ్రామ / వార్డు స్థాయిలోని ప్రభుత్వ అధికారుల సాక్ష్యాలతో తహసిల్దార్ గారిచే ధృవీకరణ పత్రం పొంది వుండాలి.

11. డప్పు కళాకారుల పెన్షన్ అర్హతలు:వయస్సు 50 సం॥లు వుండి సాంఘిక సంక్షేమశాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

12. చర్మకారుల పెన్షన్ అర్హతలు :వయస్సు 50 సం॥లు వుండి లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా పంపబడి వుండాలి.

13. అభయహస్తం పెన్షన్ అర్హతలు స్వయం సహాయక సంఘ సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వాటాధనం చెల్లించి వుండి. 60 సం॥లు కలిగి వున్నవారు.

14. తలసేమియా మరియు వివిధ రకాల వ్యాధిగ్రస్తుల పెన్షన్ అర్హతలు తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి తీవ్ర హిమోఫిలియా (2% అప్ ఫాక్టర్ 8 లేదా 9) ద్వైపాక్షిక బోద వ్యాధి గ్రేడ్-4, పక్షవాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైనవారు,తీవ్రమైన కండరాల బలహీనత మరియు ప్రమాద భాదితులు చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైనవాడు. దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధిగ్రస్తులు (3, 4 & 5 స్టేజ్లలో) డయాలసిస్ చేయించుకొని మరియు సీరం క్రియాటిన్ 5mg., రెండు వేర్వేరు సందర్భాలలో కనీసం 3 నెలల వ్యవధితో (ప్రభుత్వ ల్యాబ్లో లేదా పోనోగ్రాఫిక్ మూల్యాంకనంపై చిన్న కాటరాక్ట్ మూత్రపిండాలు (8 సెం.మీ కంటే తక్కువ) లేదా GR<15ml అంచనా కుష్టువ్యాధి గ్రస్తులు (బహుళ వైకల్యం) లేదా ఆరోగ్యశ్రీ ద్వారా కిడ్నీ, కాలేయం లేదా గుండె మార్పిడి చేయించుకున్న వ్యాధిగ్రస్తులు.

DOWNLOAD ALL APPLICATIONS RELATED TO PENSION : CLICK HERE

వై.యస్.ఆర్. చేయూత

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఎస్.సి / ఎస్.టి / బిసి మరియు మైనారిటీల కుటుంబాల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచుటకు ప్రభుత్వము రూ.75.000/- వివిధ కార్పొరేషన్ల నుండి ఆర్ధిక సహాయం అందిస్తున్నది.

 అర్హతలు

1.కుటుంబ సభ్యుల మొత్తం ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000/- పట్టణ ప్రాంతంలో రూ.12,000/- కలిగి ఉండాలి

2.వై.యస్. ఆర్. చేయూత పథకమునకు ఆధార్ కార్డ్ నందు ఉన్న వయసును ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది.

3.కుటుంబ సభ్యులందరికీ కలిపి సాగు భూమి మాగాణి ఉన్నట్లు అయితే 3 ఎకరాలు, మెట్ట భూమి అయితే 10 ఎకరాలు మరియు రెండు కలిపిన 10 ఎకరాలకు మించకుండా ఉండాలి.

4.కుటుంబసభ్యులలో ఎవరికీ 4 చక్రాల వాహనం ఉండరాదు. (బాక్సీ, ట్రాక్టర్ ఆటోలకు మినహాయింపు ఉంది)

5 కుటుంబసభ్యులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ పెన్షన్ తీసుకొనేవారు ఉండకూడదు.(పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు)

6.పట్టణ ప్రాంతంలోని కుటుంబములో ఎవరి పేరున అయినా స్థలం ఉంటే 1000 చదరపు అడుగులు లోపల ఉండాలి.

7.కుటుంబ సభ్యులలో ఎవరు కూడా ఆదాయపు పన్ను కట్టేవారు ఉండకూడదు.

8. వైయస్ఆర్ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే.

9.కుటుంబము నివసిస్తున్న గృహ యొక్క కరెంటు వినియోగం నెలకు 300 యూనిట్లు లోపల ఉండాలి.(నెలలకు సరాసరి 1800 యూనిట్లు మించరాదు)

10. అర్హత కలిగినవారు సమగ్ర కుల ధృవీకరణ పత్రము కలిగి ఉండవలెను.

అర్హతలను బట్టి గ్రామ / వార్డు వాలంటీర్ ద్వారా లబ్దిదారుల వివరాలను సేకరించడం జరుగుతుంది.

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ

సంక్షిప్త లక్ష్యం
AP ప్రభుత్వం రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలోనైనా అర్హులైన రోగులకు నిర్దిష్ట అనారోగ్యం కోసం ఉచిత చికిత్సను అందిస్తుంది.

పౌరుల ప్రయోజనాలు

  • పథకం కింద ప్రతి BPL కుటుంబానికి ఉచిత ఆసుపత్రి సేవ మరియు ఈక్విటీ యాక్సెస్. ఈ పథకం ప్రతి
  • కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది.
  • గుర్తించబడిన ఆసుపత్రి మరియు రీయింబర్స్‌మెంట్ మెకానిజం నుండి ఉచిత వైద్య సేవ
  • విపత్తు ఆరోగ్య ఖర్చులకు ఆర్థిక భద్రతను అందించండి
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ బీమా

అర్హత

  • ఆంధ్రప్రదేశ్‌లో YSR ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన అర్హత ప్రమాణాల పాయింట్ల జాబితా ఇక్కడ ఉంది
  • పౌరసరఫరాల శాఖ జారీ చేసిన BPL రేషన్ కార్డు ద్వారా గుర్తించబడిన అన్ని BPL కుటుంబాలు అర్హులు. హెల్త్ కార్డ్ / BPL (తెలుపు, అన్నపూర్ణ మరియు అంత్యోదయ అన్న యోజన, RAP మరియు TAP) రేషన్ కార్డ్‌లో ఫోటో మరియు పేరు కనిపించిన మరియు గుర్తించబడిన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులందరూ ఈ పథకం కింద చికిత్స పొందేందుకు అర్హులు.
  • దరఖాస్తుదారు తడి మరియు పొడి భూమితో సహా 35 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉండాలి
  • దరఖాస్తుదారు తప్పనిసరిగా 3000 Sft (334 చదరపు గజాలు) కంటే తక్కువ మునిసిపల్ ఆస్తి పన్నును చెల్లిస్తూ ఉండాలి
  • 5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, పార్ట్‌టైమ్ పనులు, ఔట్‌సోర్సింగ్, పారిశుద్ధ్య పనులకు అర్హులు.
  • పబ్లిక్ సెక్టార్‌లో పని చేస్తున్న ఏ ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగి మరియు గౌరవ వేతనం ఉద్యోగులకు వర్తిస్తుంది.

వైఎస్ఆర్ కాపు నేస్తం​

గౌరవ ముఖ్యమంత్రి వర్యుల హామీ మేరకు కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి సామాజిక వర్గానికి | చెందిన వయస్సు 45 సంవత్సరములు నిండి 60 సంవత్సరములకు లోబడి ఉన్న మహిళలకు ప్రతి సంవత్సరము రూ.15,000/-లు చొప్పున 5 సంవత్సరములపాటు అనగా 2019-20 నుండి 2023-24 వరకు ఆర్ధిక సహాయం మంజూరు చేసి వారిని ఆర్ధికముగా బలోపేతము చేయు ఉద్దేశముతో వారి ఖాతాలకు నేరుగా జమ చేయుట ప్రభుత్వ ధ్యేయము.

 

అర్హతలు: ఈ క్రింద సూచించిన వారిని అనర్హులుగా పరిగణించవలెను.

1. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము నుండి ఉద్యోగ విరమణ పెన్షన్ పొందు వారు మరియు ఆదాయపు పన్ను చెల్లించు వారు అనర్వులు

2. కేవలం ప్రభుత్వము నుండి “కాపు నేస్తం” పథకము ద్వారా మంజూరు చేయు ఆర్ధిక సహాయము కొరకు మాత్రమే ఆదాయ వనరులను దాచిపెట్టు వ్యక్తులు అనర్హులు.

3.కుటుంబములో ఎవరికైన మాగాణి భూమి 3 ఎకరములు పైబడి లేదా మెట్ట భూమి 10 ఎకరములకు పైబడి మరియు మాగాణి, మెట్ట భూమి వెరసి 10 ఎకరములకు పైబడి ఉన్నవారు ఈ పధకమునకు అనరులు దీనిని నిర్ధారించుటకై స్థానికముగా విచారణ చేయుటతోపాటు మీ భూమి పోర్టల్ ద్వారా కూడా తెలుసుకొనగలరు.

4.కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైనా 4 వీలర్ (నాలుగు చక్రములు) సొంత వాహనము ఉన్నట్లయితే (ఆటో, టాక్సీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.

5.పట్టణ ప్రాంతములోని కుటుంబ సభ్యులలో ఎవరికైన 1000 చదరపు అడుగులకు పైబడి సొంత నివాస గృహము ఉన్నవారు అనర్హులు.

6.ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితా మేరకు గ్రామ సభలు నిర్వహించే ఏవేని అభ్యంతరములు వచ్చిన యెడల వాటిని MPDO / Municipal Commissioner సమగ్ర విచారణ చేసి అనర్హులు ఉన్నట్లయితే అటువంటి వారిని లబ్ధిదారుల జాబితా నుండి తొలగించవలెను. అర్హులు అయిన వారిని మాత్రమే లబ్దిదారుల జాబితాలో చేర్చవలెను.

7.అయినప్పటికి అనర్హులను ఎవరికైనా ఇతర ప్రలోభాలకు లేదా ఒత్తిళ్ళకు లోనై జాబితాలో చేర్చిన యెదల సదరు గ్రామ / వార్డు వాలంటీర్లు మరియు సెక్రటరీలపై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును.

8.ఎంపిక చేసిన లబ్దిదారుల అర్హతలను సామాజిక తనిఖీ ద్వారా third party మరియొకసారి క్షుణ్ణముగా పరిశీలించబడును. కావున గ్రామ / వార్డు వాలంటీర్లు మరియు సెక్రటరీలు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి. నిబంధనల మేరకు అర్హత గల లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయవలెను.

పైన ఉదహరించిన అనర్హతలతో పాటు ఈ క్రింద సూచించిన అంశములను కూడా క్షుణ్ణముగా పరిశీలించి. సమగ్రముగా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకొనవలెను.

ఈ పథకము మరింత పారదర్శకముగా అమలు చేయుటలో భాగముగా ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు లోనవకుండా సమర్ధవంతముగా విధులు నిర్వహించవలసిందిగా కోరుచు….

గ్రామ / వార్డు సంక్షేమ సహాయకుల విధులు:

గ్రామ / వార్డు వాలంటీర్లుచే రీ సర్వే చేసినటువంటి లబ్దిదారుల జాబితాను క్షుణ్ణముగా పరిశీలించి నిర్ణీత వెబ్ పోర్టల్ నందు నమోదు చేయవలెను. సామాజిక తనిఖి మరియు గ్రామ సభలు నిర్వహించు సమయములో సదరు సిబ్బందికి సహాయ సహకారములు అందించుటతోపాటు ఆ కార్యక్రమము సక్రమముగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకొనవలెను.

మండల పరిషత్ అభివృద్ధి అధికారి / మునిసిపల్ కమీషనర్ల విధులు :

గ్రామ / వార్డు సచివాలయముల నుండి అనగా విధాన సంక్షేమ సహాయకులు సమర్పించిన లబ్ధిదారుల జాబితాను మరియొక్క సారి క్షుణ్ణముగా పరిశీలించవలెను. గ్రామ సభల నందు మరియు సామాజిక తనిఖీలో గుర్తించిన అనరులను లబ్దిదారుల జాబితాలో చేర్చలేదని నిర్ధారించిన పిదప మాత్రమే జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘమునకు పూర్తి అర్హత గల లబ్దిదారుల వివరములను ఆన్లైను ద్వారా సమర్పించవలెను. మరియు ఈ లబ్ధిదారుల జాబితాలు రూపొందించుటలో గ్రామ / వార్డు స్థాయి అధికారులు అనగా గ్రామ / వార్డు. వాలంటీర్లు, గ్రామ / వార్డు కార్యదర్శులు, గ్రామ / వార్డు సంక్షేమ విద్యా సహాయకులు మొదలైనవారు ప్రలోభాలకు లోబడి లేదా ఇతర కారణములతో ఉద్దేశ్యపూర్వకముగా తప్పులు చేసినట్లయితే, అట్టి వారిపై తగు కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకొనవలెను గ్రామ / వార్డు స్థాయిలో నిర్దేశించిన షెడ్యూలు మేరకు జరుగు కార్యక్రమమునకు తప్పనిసరిగా హాజరై సదరు కార్యక్రమము సక్రమముగా జరుగుట కొరకు తగు చర్యలు గైకొనవలెను.

కార్య నిర్వాహక సంచాలకులు, జిల్లా బి.సి. కార్పొరేషను వారి విధులు:

జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పైన సూచించిన మార్గదర్శక సూత్రముల మేరకు శిక్షణ కార్యక్రమములు సక్రమముగా జరుపుటతపాటు సదరు ఉత్తర్వులు ప్రతులు గ్రామ / వార్డు స్థాయి వరకు చేరు విధముగా జాగ్రత్తలు తీసుకొనవలెను. షెడ్యూలు మేరకు గ్రామ / వార్డు స్థాయిలో లబ్దిదారుల జాబితాలు సరిచేయు కార్యక్రమములకు హాజరు అగుటతోపాటు మండల / మునిసిపాలిటి మరియు గ్రామ / వార్డు స్థాయి అధికారులందరికీ తగు సలహాలు సూచనలు ఇచ్చుటయేకాక వారి సందేహములను కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేయవలెను.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top