ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసే మరియు రిటైర్ అయ్యిన వాళ్ళ అందరికి నగదు రహిత చికిత్సను పొందేందుకు నూతన ఆరోగ్య పథకాన్ని రూపొందించింది. ఈ పథకం దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ కేర్ వంటి సదుపాయాలు కలిగి ఉంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎలా అప్లై చెయ్యాలి మరియు ఎలా EHS కార్డు డౌన్లోడ్ చేసుకోవాలో మరియు అర్హత, కవరేజ్ ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్య సంరక్షణ మరియు నాణ్యమైన వైద్య సేవలను అందించడం అనే ప్రాథమిక లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో డాక్టర్ YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (EHS) అమలు చేస్తుంది. ఈ పథకం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎంప్యానెల్డ్ ఆసుపత్రులు లేదా నెట్‌వర్క్ హాస్పిటల్స్ (NWH)లో నగదు రహిత చికిత్సను పొందగలరు.
ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) వల్ల ప్రయోజనాలు ?
ఇన్-పేషెంట్ చికిత్స – గుర్తించబడిన వ్యాధుల కోసం లిస్టెడ్ థెరపీల కోసం చికిత్స* ఎండ్-టు-ఎండ్ క్యాష్‌లెస్ సర్వీస్ 10 రోజుల వరకు డిశ్చార్జ్ తర్వాత మందులు మరియు 30 రోజుల వరకు సమస్యల కవరేజీ. జాబితా చేయబడిన చికిత్సల కోసం ఉచిత అవుట్-పేషెంట్ మూల్యాంకనం.
ఫాలో-అప్ సర్వీస్ – 1-సంవత్సరం వరకు సేవలు జాబితా చేయబడిన చికిత్సలపై సంప్రదింపులు, పరిశోధన, మందులు మొదలైనవి.
దీర్ఘకాలిక వ్యాధులకు ఔట్-పేషెంట్ చికిత్స – నోటిఫైడ్ ఆసుపత్రులలో ముందే నిర్వచించబడిన దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స.
హాస్పిటల్ స్టే –
- స్లాబ్ A (పేలు – I నుండి IV): సెమీ-ప్రైవేట్ వార్డ్
- స్లాబ్ B (పేలు – V నుండి XVII): సెమీ-ప్రైవేట్ వార్డ్
- స్లాబ్ C (పే ప్రకారం – XVIII నుండి XXXII): ప్రైవేట్ వార్డు
ఆర్థిక కవరేజ్ – అర్హత మొత్తం: అనారోగ్యం యొక్క ప్రతి ఎపిసోడ్‌కు రూ. 2 లక్షలు. ముందుగా నిర్ణయించిన ప్యాకేజీలు రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అర్హత మొత్తం వర్తించదు. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న క్లెయిమ్‌లను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ యొక్క సీఈఓ(CEO ) సెట్టిల్ చేస్తారు .
ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అర్హత ?
- అన్ని సాధారణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. స్థానిక సంస్థల తాత్కాలిక ఉద్యోగులు.
- అన్ని సర్వీస్ పెన్షనర్లు.
- చట్టబద్ధంగా వివాహం చేసుకున్న జీవిత భాగస్వామి
- ఆధారపడిన చట్టబద్ధమైన పిల్లలు (సవతి-పిల్లలు మరియు దత్తత తీసుకున్న పిల్లలు).
- తల్లిదండ్రులు(జీవసంబంధమైన లేదా దత్తత తీసుకున్న) వారి జీవనోపాధి కోసం ఉద్యోగిపై ఆధారపడి ఉండి ఉంటే.
- నిరుద్యోగ కుమార్తెలు: అవివాహిత/వితంతువు/విడాకులు/ విడిచిపెట్టినవారు.
- నిరుద్యోగ కుమారులు: 25 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ.
- వికలాంగ పిల్లలు: ఉపాధి దొరకని వైకల్యం ఉన్నవారు.
ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) కొరకు ఎలా నమోదు చేసుకోవాలి ?
Step 1: ముందుగా అధికారిక వెబ్ సైట్ పై క్లిక్ చేయాలి. – CLICK HERE
Step 2: మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే Forgot Password పై క్లిక్ చేయాలి.
- Click Here To Proceed పై క్లిక్ చేయాలి.
- Enter UserID వద్ద Zero తో కలిపి మీ 7అంకెల HRMS ID ఎంటర్ చేయాలి.
- Login As లో Employee ను ఎంచుకోవాలి.
- Captcha సరిగా ఎంటర్ చేయాలి.
- Go పై క్లిక్ చేయాలి.వెంటనే HRMS కు లింక్ అయిన Mobile Number కు OTP వెళ్తుంది. నెంబర్ మార్చుకోటానికి Payroll HERB Self / DDO Login లో మార్చుకోవచ్చు.
- Enter OTP వద్ద వచ్చిన OTP ఎంటర్ చేయాలి.Verify పై క్లిక్ చేయాలి.
- Resend OTP పై క్లిక్ చేస్తే మరలా OTP వస్తుంది.
- Verify పై క్లిక్ చేయాలి. OTP Verified Successfully అని వస్తుంది.
- New Password వద్ద 8 Character ఉండి,ఒకటైన Upper Case & Lower Case ఉండి,ఒకటైన Number ఉండి, ఒకటైన Special Character (#₹<>..) ఇలా పెట్టుకోవాలి..
- Confirm New Password లో పైన ఏది ఎంటర్ చేస్తే అదే ఎంటర్ చేయాలి.
- Update పై క్లిక్ చేస్తే Password Changed Successfully అని వస్తే మారినట్టు.
మళ్ళీ Home Page కు వచ్చి
- Username వద్ద HRMS ID
- Password వద్ద ఇప్పడు మార్చుకున్న Password ఎంటర్ చేయాలి.
- Login Type లో Employee సెలెక్ట్ చేయాలి.
- Captcha Code ఎంటర్ చేయాలి.
- Login పై క్లిక్ చేయాలి.
- Note : Captcha సరిగా ఎంటర్ చేసిన Please Enter Valid Captcha అని చూపిస్తే అప్పుడు Browsing History క్లియర్ చేసి ట్రై చెయ్యండి.
Step 3: మీరు మొదటి సారి EHS కార్డును సృష్టించాలనుకుంటే INITIATE HEALTH CARD అనే ఆప్షన్ నమోదులు అనే సెక్షన్‌లో ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి
- Click Here To Initiate Enrollment పై క్లిక్ చేయాలి.
- Aadhar Number పై టిక్ చేసి ఉద్యోగి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- Confirm Aadhaar Number వద్ద మరలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- Retrieve Details పై క్లిక్ చేయాలి.
- Date Of Birth లో DOB ఎంటర్ చేయాలి.
- Gender లో Male/Female ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
- Maritial Status లో పెళ్లి అయ్యిందో లేదో సెలెక్ట్ చేసుకోవాలి.
- Date Of Joining లో Service లొ జాయినింగ్ తేదీ వేయాలి.
- Community వద్ద కులం ను సెలక్ట్ చేసుకోవాలి.
- Blood Group లొ సరిగా రక్తం గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి.
- Disability లొ దివ్యంగులా ? కారా? అని అడుగుతుంది.
- Employee Type లొ Automatic గా Employee అని వస్తుంది.
- Address Details ఇవ్వాలి.
- Residential Address లొ మీ చిరునామా వివరాలు ఇవ్వాలి.
- Email Mobile Number వివరాలు అడుగుతుంది.
- Office Address లొ మీ సచివాలయ చిరునామా ఇవ్వాలి.
- Email వద్ద ఆఫీస్ email ఇవ్వాలి.
- Mobile Number వద్ద Office Mobile No ఇవ్వాలి. Number లేకపోతే DDO నెంబర్ ఇవ్వాలి.
- Identification Details లొ SSC లొ ఉన్న ప్రకారం రెండు పుట్టు మచ్చల వివరాలు ఇవ్వాలి.
Posting Details లొ ప్రస్తుతం పనిచేస్తున్న పోస్ట్ వివరాలు ఇవ్వాలి.
- DDO Code : Your DDO Code (Not CFMS ID or HRMS ID)
- Designation : Your Designation.
Note : Claim చేసే సమయం లొ Designation అడుగుతుంది. అప్లికేషన్ చేసే సమయం లొ Designation పూర్తిగా ఇవ్వకపోతే Claim లొ ఇవ్వవచ్చు.
- Service : Automatic గా Fetch అవుతుంది.
- Category : Automatic గా Fetch అవుతుంది.
Pay Details లొ ప్రస్తుత జీత బత్యాలా వివరాలు ఇవ్వాలి.
- Pay Source : GOAP PRC
- PRC : 2022 (example)
- Pay Grade : IV (example)
- Current Pay : 22460 (example)
- Declaration పై టిక్ చేయాలి.
- Add Beneficiary పై క్లిక్ చేసి కుటుంబ సభ్యులను Add చేయాలి.
- Spouse (Husband / Wife),
- Mother,
- Father,
- Son,
- Daughter,
- New Born Baby వీరిని Add చేసే అవకాశం ఉంది.
- Add చెయ్యటం కోసం వారి ఆధార్ కార్డు, Passport Size Photo అవసరం ఉంటుంది. రెండు కూడా JPG /JPEG / PNG ఫార్మాట్ లొ 200KB లోపు లొ ఉండాలి.
- పూర్తి పేరు,
- ఉద్యోగి తో సంబంధం,
- బ్లడ్ గ్రూప్,
- ఆధార్ నెంబర్,
- DOB,
- దివ్యంగులా కారా? అనే వివరాలు అవసరం ఉంటాయి.
- 5 సంవత్సరాల లోపు పిల్లలను Add చేయాలి అంటే వారి DOB, Photo ఉండాలి.
- Spouse పెన్షనర్ అయితే
- Employee ID,
- HOD,
- Last Posted District,
- Pension Office District ,
- STO Unit,
- Pay Source,
- Pay Grade,
- Aadhar, Photo ఉండాలి.
- Spouse ఉద్యోగి అయితే
- Employees ID,
- HOD,
- District,
- DDO Code,
- Designation,
- Service,
- Category,
- Pay Source,
- PRC,
- Pay Grade,
- Current Pay,
- Certificate,
- Photo,
- SR Copy ఉండాలి.
- Add Attachments ద్వారా ఉద్యోగి డాక్యుమెంట్ లు Upload చేయాలి. అందులో
- Service Register
- Aadhar Card
- Photo
- DOB Certificate (Optional) Upload చేయాలి.
అన్ని కూడా JPG /JPEG / PNG ఫార్మాట్ లొ 200KB లోపు లొ ఉండాలి. SR కాపీ ఒక్కో Page గా Upload చేయాలి. + ఉపయోగించి మూడు మూడు పేజీ లు Upload చెయ్యవచ్చు. చివరగా Close పై క్లిక్ చేయాలి.
Print Application పై క్లిక్ చేసి మొత్తం వివరాలుతో కూడిన ఫారం ను ప్రింట్ తీసుకోవాలి. అందులో Employee Signature వద్ద ఉద్యోగి సంతకం చేసి, Place వద్ద సచివాలయం ఉన్న ప్లేస్ పేరు, Date వద్ద అప్లికేషన్ చేస్తున్న తేదీ వేయాలి. ఆ కాపీ ను స్కాన్ చేస్సి JPG /JPEG / PNG ఫార్మాట్ లొ 200KB లోపు లొ ఉండేలా సాఫ్ట్ కాపీ చేయాలి.
Add Attachments లొ పైన స్కాన్ చేసిన కాపీ Upload చేయాలి.
Submit For Approval పై క్లిక్ చేసి అప్లికేషన్ Final Submit చేయాలి.
తరువాత అప్లికేషన్ సంబంధిత DDO లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది.
దరఖాస్తు ఉద్యోగి సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO)కి పంపబడుతుంది. DDO దరఖాస్తును హెల్త్ ధృవీకరించిన తర్వాత, EHS జనరేట్ చేయబడుతుంది.
Step 4: DDO Approval చేయు విధానం.
EHS Portal ఓపెన్ చేసి
Forgot Password పై క్లిక్ చేయాలి.
- Click Here To Proceed పై క్లిక్ చేయాలి.
- Enter UserID వద్ద DDO Code ఎంటర్ చేయాలి.
- Login As లో DDO ను ఎంచుకోవాలి.
- Captcha సరిగా ఎంటర్ చేయాలి.
- Go పై క్లిక్ చేయాలి. వెంటనే HRMS కు లింక్ అయిన Mobile Number కు OTP వెళ్తుంది. నెంబర్ మార్చుకోటానికి Payroll HERB Self / DDO Login లో మార్చుకోవచ్చు.
- Enter OTP వద్ద వచ్చిన OTP ఎంటర్ చేయాలి.Verify పై క్లిక్ చేయాలి.
- Resend OTP పై క్లిక్ చేస్తే మరలా OTP వస్తుంది.
- Verify పై క్లిక్ చేయాలి. OTP Verified Successfully అని వస్తుంది.
- New Password వద్ద 8 Character ఉండి,ఒకటైన Upper Case & Lower Case ఉండి,ఒకటైన Number ఉండి, ఒకటైన Special Character (#₹<>..) ఇలా పెట్టుకోవాలి..
- Confirm New Password లో పైన ఏది ఎంటర్ చేస్తే అదే ఎంటర్ చేయాలి.
- Update పై క్లిక్ చేస్తే Password Changed Successfully అని వస్తే మారినట్టు.
Login Page కు వచ్చి
- Username : DDO code
- Password : ముందు పెట్టిన Password
- Login Type : DDO
- Captcha : చూపించన Captcha Code ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
- Enrolled Employees Worklist పై క్లిక్ చేయాలి.
- Enrollment ID పై క్లిక్ చేయాలి.
- Remarks : Eligible For EHS (Optional By DDO)
- Approve పై క్లిక్ చేస్తే DDO వారు ఆమోదం తెలిపినట్టు అవుతుంది.
3.Download & Print EHS Card
Login పేజీ లొ ఉద్యోగి లాగిన్ అయ్యాక హోమ్ పేజీ లొ Download Health Card పై క్లిక్ చేయాలి.
Status లొ ఉన్న Telugu / English పై క్లిక్ చేస్తే Language ప్రకారం కార్డు చూపిస్తుంది.
Print పై క్లిక్ చేసి Settings లొ A4, 75-80% Size లొ Print ఇస్తే ATM కార్డు Size లొ Print వస్తుంది. అదే కాపీ PDF రూపం లొ Save కూడా చేసుకోండి.
Family Members Cards కూడా ఇక్కడే చూపిస్తుంది.
దీర్ఘకాలిక ఔట్ పేషెంట్ చికిత్స(Chronic Out-Patient Treatment):
EHS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలిక వ్యాధులకు ఔట్ పేషెంట్ చికిత్సను అందిస్తుంది. వారం లో ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి మరియు వాటిలో ఇవి ఉన్నాయి:
వైద్యుని సంప్రదింపులు(Doctor’s consultation).
Investigations (laboratory services and radiology services).
Pharmacy(మందులు)
40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు వార్షిక ఆరోగ్య పరీక్ష(Yearly health checkup).
- Hypertension(హైపర్ టెన్షన్)
- Hyperthyroidism(హైపర్ థైరాయిడిజం)
- Hypothyroidism(హైపోథైరాయిడిజం)
- Rheumatoid Arthritis(కీళ్ళ వాతము)
- Bronchial Asthma(బ్రోన్చియల్ ఆస్తమా)
- Parkinson’s Disease (పార్కిన్సన్స్ వ్యాధి)
- Type 1 and 2 DM(టైప్ 1 మరియు 2 DM)
- COPD
- SLE and other Connective Tissue Disorders
- Gout(గౌట్)
- CAD-Medical (CAD-మెడికల్)
- Convulsive Disorder(కన్వల్సివ్ డిజార్డర్)
- Inflammatory Bowel Disease (తాపజనక ప్రేగు వ్యాధి)
- Inflammatory Bowel Disease
- (సైకోసిస్ మరియు ఇతర దీర్ఘకాలిక మానసిక సమస్యలు)
- Stroke(స్ట్రోక్)
- Vascular Occlusive Disorder of Extremities(వాస్కులర్ అక్లూజివ్ డిజార్డర్ ఆఫ్ ఎక్స్‌ట్రీమిటీస్)
- Osteoarthritis(ఆస్టియో ఆర్థరైటిస్)
- Psoriasis(సోరియాసిస్)
- Chronic Hepatitis(దీర్ఘకాలిక హెపటైటిస్)
- Cirrhosis(సిర్రోసిస్)
- Cardiac Failure(కార్డియాక్ ఫెయిల్యూర్)
- Nephrotic Syndrome(నెఫ్రోటిక్ సిండ్రోమ్)
- Chronic Kidney Disease(దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి)
- Arrhythmias(అరిథ్మియాస్)
పెన్షనర్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రక్రియను ఉద్యోగుల ఆరోగ్య పథకంతో భర్తీ చేసింది. పెన్షనర్లు లేదా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల కోసం నమోదు ప్రక్రియ క్రింద ఉంది:
EHS పెన్షనర్ల నమోదు ప్రక్రియ:
- ఆధార్ కార్డ్: మీ ఆధార్ కార్డ్‌ని స్కాన్ చేసి, మీ ఫోటో మరియు ఆధార్ నంబర్ స్పష్టంగా కనిపించేలా చూసుకోండి.
- ఫోటోగ్రాఫ్: 200Kb పరిమాణంలో 45mm x 35mm ICAO కంప్లైంట్ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్ స్కాన్.
- వైకల్యం సర్టిఫికెట్లు (అయ్యితే)
- జీవిత భాగస్వామి యొక్క పెన్షనర్ ID/ఉద్యోగి ID : రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్నప్పుడు లేదా సర్వీస్ పెన్షనర్ అయితే జీవిత భాగస్వామి యొక్క స్కాన్ చేయబడిన కాపీ.
- పుట్టిన తేదీ సర్టిఫికెట్ : 5 తక్కువ వయస్సు ఉన్న కుటుంబ సభ్యులపై ఆధారపడిన DOB సర్టిఫికెట్ యొక్క స్కాన్.
దశల వారీ పెన్షనర్ లాగిన్ సూచనలు:
అవసరమైన అన్ని పత్రాలతో, మీరు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అలాగే, మీరు డాక్యుమెంట్‌లతో పాటు STO/APPOని సంప్రదించవచ్చు లేదా అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించవచ్చు.
దశ 1: EHS వెబ్ పోర్టల్‌ని సందర్శించండి మరియు మీ వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. మీ వద్ద వివరాలు లేకుంటే, మీ వినియోగదారు IDని తెలుసుకోవడానికి STO/APPOని సంప్రదించండి లేదా EHS టోల్-ఫ్రీ నంబర్ 104కు డయల్ చేయండి.
దశ 2: మీ వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి మరియు వెబ్‌సైట్‌లో అందించిన సూచనలను చదవండి.
దశ 3: నమోదు ఫారమ్‌ను తెరిచి, మీ విభాగాధిపతి, STO/APPO మరియు జిల్లాతో సహా అన్ని వివరాలను పూరించండి.
దశ 4: అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అటాచ్ చేయండి.
దశ 5: దరఖాస్తును సమర్పించే ముందు మీరు మొత్తం డేటాను ధృవీకరించారని నిర్ధారించుకోండి.
దశ 6: ‘సమర్పించు’పై క్లిక్ చేసి, దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.
దశ 7: దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్‌పై సంతకం చేసి, సంతకం చేసిన పత్రాన్ని తిరిగి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 8: ఇప్పుడు, సంతకం చేసిన దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకొని, మీ సంబంధిత STO/APPOతో సమర్పించండి.
ఉదాహరణ: EHS పెన్షనర్ దరఖాస్తు ఫారమ్
- PPO సంఖ్య
- పేరు (PPO ప్రకారం)
- ఆధార్ కార్డ్ నంబర్
- DOB (PPO ప్రకారం)
- సెక్స్ (పురుషుడు/ఆడ)
- వైవాహిక స్థితి (ప్రస్తుత వైవాహిక స్థితి)
- పదవీ విరమణ తేదీ
- వైకల్యం రకం మరియు వైకల్యం శాతం
- చిరునామా మరియు మీరు ప్రస్తుత ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్
- రేషన్ కార్డు సంఖ్య (మీకు రేషన్ కార్డు ఉంటే)
- గుర్తింపు గుర్తులు మీ శరీరంపై దాని ఖచ్చితమైన స్థానంతో పాటుగా కనిపించే రెండు గుర్తింపు గుర్తులు.
- HOD (మీరు పని చేస్తున్న చివరి విభాగాధిపతి పేరు.)
- జిల్లా (మీరు పని చేస్తున్న చివరి జిల్లా పేరు.)
- పే గ్రేడ్
- STO/APPO కోడ్ మరియు మీరు పెన్షన్ పొందుతున్న కార్యాలయ పేరును నమోదు చేయండి.
- ఫోటో ఉద్యోగి/పెన్షనర్ మరియు కుటుంబ సభ్యులపై ఆధారపడిన ప్రతి ఒక్కరి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సాఫ్ట్ కాపీ. (పరిమాణం 35 mm వెడల్పు x 45 mm ఎత్తు ).
- ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డ్/ఎన్రోల్‌మెంట్ నంబర్ కాపీని నంబర్ మరియు ఫోటో స్పష్టంగా కనిపించేలా స్కాన్ చేయండి.
- DOB సర్టిఫికెట్ ఎంచుకున్న కుటుంబ సభ్యుల విషయంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడు.
- వైకల్యం సర్టిఫికెట్ సభ్యులు ఎవరైనా డిసేబుల్ అయితే.
- కుటుంబ సభ్యుల వివరాలు
- పేరు, సంబంధం, ఆధార్ నంబర్
- జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగి ID/పెన్షనర్ ID
పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి:
మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్థితిని తెలుసుకోవడానికి క్రింది దశలను అనుసరించండి:
దశ 1: ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ వెబ్ పోర్టల్‌లోని EHS విభాగాన్ని సందర్శించండి .
దశ 2: ‘పెన్షనర్ మెనూ’ కింద, ‘పెన్షనర్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్టేటస్’పై క్లిక్ చేయండి.
దశ 3: కొత్త పేజీలో, రీయింబర్స్‌మెంట్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జరిగిందో లేదో నిర్ధారించడానికి ఎంచుకోండి.
దశ 4: ట్రస్ట్ నంబర్ మరియు DME నంబర్‌ను నమోదు చేసి, స్థితిని తెలుసుకోవడానికి ‘శోధన’పై క్లిక్ చేయండి.
దీర్ఘకాలిక ఔట్ పేషెంట్ చికిత్స:
EHS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు దీర్ఘకాలిక వ్యాధులకు అవుట్-పేషెంట్ చికిత్సను అందిస్తుంది. వారపు రోజులలో మధ్యాహ్నం 2 నుండి 4 గంటల మధ్య మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయి. సేవల్లో ఇవి ఉన్నాయి:
సంప్రదింపులు.
పరిశోధనలు (రేడియాలజీ సేవలు మరియు ప్రయోగశాల సేవలు).
మందులు
EHS యొక్క క్లెయిమ్ ప్రక్రియ:
Below are the contact details of the EHS scheme for Andhra Pradesh state government employees:
EHS Toll-Free Number: 104
For Health Card Issues and Grievances Under EHS:
Phone Number – 8333817469/14/06 Or: 0863-2259861 (Ext:326).
Email ID – ap_ehf@ysraarogyasri.ap.gov.in
For Medical Reimbursement Status and Issues:
Phone Number – 8333817363 Or: 0863-2259861 (Ext: 329)
Email ID – ap_mr@ysraarogyasri.ap.gov.in
Contact CEO: 0863-2259861 (Ext: 302)
Dr. YSR Aarogyasri Health Care Trust Address
D.No. 25-16-116/B, Chuttugunta,
Behind Gautam’s Hero Showroom,
Guntur – 522004
Andhra Pradesh
Phone Number – 0863-2222802/2259861