Table of Contents
Toggle100
ఏ సమయంలోనైనా సరే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సాయం పొందేందుకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో ఈ టోల్‌ఫ్రీ నంబర్ 24 గంటలూ పని చేస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, మాట్లాడే ప్రతి మాటా రికార్డవుతుంది.
101
ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సాయం కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయాలి. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ప్రమాదాన్ని నివారిస్తారు. లేదా ప్రమాద స్థాయిని తగ్గిస్తారు.
104
ఆస్పత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, వైద్యసేవలు అందించేందుకు 104 వాహనం ఉపయోగపడుతుంది. ఈ సేవలు పొందాలనుకునే వారు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఈ వాహనంలోని సిబ్బంది ఒక స్థాయి అనారోగ్య సమస్యలకు సంబంధిత టెస్టింగ్, ల్యాబ్‌లో పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు. అలాగే ఆస్పత్రిలో ప్రసవాంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నారు.
14410
YSR టెలిమెడిసిన్ ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చెయ్యొచ్చు. మరియు కోవిడ్-19 యొక్క ఏవైనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు 14410కి డయల్ చేయడం ద్వారా వైద్య సలహా పొందవచ్చు.
1907
వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉంటే 1907 నంబరుకు ఫోన్ చేయవచ్చు. మీ పంట సాగులో మెళకువలు, దిగుబడులు, సలహాలు, సూచనలను రైతులు పొందవచ్చు.
1912
మీ వీధి లేదా మీ ఇంటి విద్యుత్ సరఫరాలో ఎటువంటి సమస్యలు ఎదురైనా 1912 నంబర్‌కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
108
అత్యవసరముగా అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు, ఏదైనా ప్రమాదాలకు గురై గాయపడిన వారు 108కు ఫోన్ చేసి ప్రభుత్వ అంబులెన్సు సేవలు పొందవచ్చు. 108 కాల్ సెంటర్ నుంచి సమీపంలోని అంబులెన్సు వాహన సిబ్బందికి సమాచారం వస్తుంది. వారు వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి, ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు.
14400
వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు నంబర్ 14400 కేటాయించారు. 14400 నంబరుకు ఫోన్ చేసిన ఆ ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది పేరు ఇతర వివరాలను చెప్పవచ్చు. ఏసీబీ అధికారులు మీ పేరును గోప్యంగా ఉంచుతారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా ఈ నంబరుకు ఫోన్ చేయవచ్చు.
14567
- వృధ్ధుల హెల్ప్ లైన్ 14567
- పిల్లలు దూరంగా ఉండి వంటరితనంగా ఫీల్ అవుతున్నారా కాల్ 14567
- వృద్ధుల హక్కుల కోసం తెలుసుకోవాలా కాల్ 14567
- సీనియర్ సిటిజెన్ కార్డు పొందాలనుకుంటున్నారా కాల్ 14567
- వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో, ఎలా మళ్ళీ అప్లై చెయ్యాలో తెలియడం లేదా కాల్ 14567
- కొడుకులు, కోడళ్ళు మానసికంగా, శారికంగా తల్లి తండ్రులను వేధిస్తున్నారా కాల్ 14567
- వృధ్ధులకు సంబంధించిన హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీసుల అడ్రస్ లు తెలుసుకోవాలని కాల్ 14567
- వృద్దులకోసం ప్రత్యేక నాయస్థానాలు, వృద్దుల ప్రత్యేక జిల్లా న్యాయస్థానాలకోసం తెలుసుకోవాలా కాల్ 14567
- వృద్దులు, తల్లితండ్రుల చట్టాలకోసం తెలుసుకోవాలా కాల్ 14567
- వృద్ధాశ్రమాలు, నైట్ షెల్టర్లు, కేర్ గివింగ్ సెంటర్లు, కోసం వివరాలు కావాలా కాల్ 14567
- పోలీస్ స్టేషన్, వివరాలు కావాలా కాల్ 14567
- జిల్లాన్యాయ సేవాధికారుల సంస్థల వివరాలు కావాలా కాల్ 14567
- జిల్లా సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ వివరాలు కావాలా కాల్ 14567
- పిల్లలు తమ తల్లితండ్రుల పోషణను చూడటంలేదా కాల్ 14567
- వృద్దులకు ఫ్యామిలీ మానేజ్మెంట్ తెలియడంలేదా కౌన్సెలింగ్ కొరకు కాల్ 14567
- వృద్దుల చట్టాలు, గవర్నమెంట్ స్కీమ్స్ మొదలగువాటి వివరాలు కావాలా కాల్ 14567
- వృద్దులకు న్యాయపరమైన సూచనల కొరకు కాల్ 14567
ఉదయం 8 నుండి రాత్రి 8 ఎవరైనా వృద్దులకు సంభందిన సలహాలు, సమాచాలాలు, సూచనలు మరియు సమస్యల పిర్యాదుల పరిస్కారాల కొరకు కాల్ చెయ్యండి 14567
పైన పేర్కొన్న సమాచారాల కొరకు వృధ్ధులు మాత్రమే కాదు. ఎవరైనా కాల్ చెయ్యొచ్చు.