YSR KALYANAMASTHU SHAADI-THOFA New 2023-24

YSR Kalyanamasthu shaadi-thofa

The State government has decided to implement a Marriage Financial Assistance Scheme, ‘YSR Kalyanamasthu’, for SCs / STs / BCs / minorities other than Muslims / differently-abled, and ‘YSR Shaadi Tohfa’ for Muslims from October 1.

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫాలో భాగంగా..

  • ఎస్సీలకు రూ. లక్ష రూపాయలు
  • ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు
  • ఎస్టీలకు రూ. లక్ష
  • ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • బీసీలకు రూ. 50వేలు
  • బీసీల కులాంత వివాహాలకు రూ.75వేలు
  • మైనార్టీలకు రూ. లక్ష
  • వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు
  • భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు అందించనుంది.

అర్హతలు, విధి విధానాలు :  

వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు.ఆ రోజు నవశకం -మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. 

  • వివాహ తేదీ నాటికి పధువు వయస్సు 18. వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి.
  • తొలివివాహానికి మాత్రమే అర్హత. 
  • వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు) 
  • వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి. 
  • మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు. 
  • కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కుటుంబాలకు మినహాయింపు ఉంది. 
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
  •  నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
  •  ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. 
  • మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.

ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.

YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు వరుడు, వధువుకు ఎంత వయసు ఉండాలి ?

వరుడుకు 21 సంవత్సరాలు. వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఒక కుటుంబం లో ఇద్దరు మహిళలు ఉండి ఒకరికి YSR Kalyana Masthu, YSR Shaadi Thofa వస్తే రెండో మహిళకు కూడా వస్తాయా ?

రెండో మహిళకు రావు.

వదువు వరులకు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు విద్యా అర్హతలు ఉండాలా?

2024 జూన్ 30 వరకు పెళ్లి అయ్యే వదువు వరుడికి ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు. తరువాత కనీసం 10వ తరగతి చదివి ఉండాలి.

ఏ రోజు నుంచి పెళ్లి అయిన వారు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు అర్హులు ?

01 అక్టోబర్ 2022 నుంచి ఆన్‌లైన్ అవకాశం ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top