Latest Updates
మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ విధుల్లో వినియోగించొద్దు
- రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులను రెగ్యులర్ పోలీసు విధుల్లోకి వినియోగించొద్దని రాష్ట్ర డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
- ఈ మేరకు శుక్రవారం రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్లు, రేంజ్ డిఐజి, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
- గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని వారికి కావాల్సిన పూర్తి సహాయ, సహకారాలు అందించడం మహిళా సంరక్షణ కార్యదర్శుల ముఖ్య ఉద్దేశమన్నారు.
- వీరిని పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్, శాంతి భద్రతలకు వినియోగించరాదని తెలిపారు. అలాగే వారిని తరచూ పోలీస్ స్టేషన్కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని ఆదేశించారు.
- ఎక్కడైనా ఇందుకు విరుద్ధంగా మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ స్టేషన్ విధులకు వినియోగించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
FAQ'S
వీరిలో చాలామంది గ్రాడ్యుయేట్లు మాత్రమే కాకుండా పి.జి, పి.హెచ్.డి లు పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. కావున వీరందరూ సమయస్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను వారి యొక్క బుద్ధి బలంతో పరిష్కరించగలరు.
లేదు, సచివాలయ మహిళా పోలీసులు గ్రామ/వార్డు పరిధిలో మహిళలు , చిన్నారులకు ఏమైనా అన్యాయం జరిగితే వెంటనే ఆ సమాచారాన్ని తెలుసుకొని
సమస్య చిన్నదైనట్లయితే తన పరిధిలో కౌన్సిలింగ్ ద్వారా వాటిని పరిష్కరించడం సమస్య పెద్దదైనట్లయితే వెంటనే ఆ సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం చేస్తారు. సివిల్ పోలీస్ విధులు వీరు నిర్వర్తించరు.
- సచివాలయం పోలీసులు గ్రామ వార్డు పరిధిలో ఉన్న ప్రజలతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కార మార్గాలను చూపుతూ,
- అవసరమైన సందర్భాల్లో అనగా ఇరు వర్గాల మధ్య ఏమైనా వివాదాలు ఏర్పడుతున్న సందర్భాల్లో కౌన్సిలింగ్ చేయడం, వరకట్నం వేధింపులు, గృహింస, మహిళపై జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడం,
- బాల్య వివాహాలను నిలుపుదల చేయడం, బాల కార్మికులను గుర్తించి వారిని బడికి పంపే ఏర్పాట్లు చేయడం, 18 సంవత్సరాల బాల బాలికలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు, యుక్త వయసులో తెలిసి తెలియక చేసే తప్పులు వలన ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న అంశాలను గూర్చి అవగాహన కల్పించడం.
- సైబర్ నేరాలు పట్ల, ఆన్లైన్ గేమ్స్ ,షాపింగ్స్, లోన్ ఆప్స్ వంటి మోసాల గూర్చి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరుగుతుంది.
యూనిఫామ్ అనేది ఒక పోలీస్ కు, డాక్టర్ కు, లాయర్ కు ఏ విధంగా అయితే గౌరవాన్ని, గుర్తింపునిస్తుందో అదేవిధంగా మహిళా పోలీసుల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన యూనిఫామ్ వారికి రక్షణగా ఉండడమే కాకుండా ధైర్యాన్నిస్తుంది. వారిని ఎవరైనా ఎదిరించే ప్రయత్నం చేస్తే ఆ గుర్తింపు వారిని కాపాడుతుంది.